గుడిలో కొట్టే గంట వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా…?

-

మనదేశం సంస్కృతి లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత గోచరిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో సంప్రదాయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సహజంగా మన భారతీయ సంస్కృతి లో ఎక్కడ చూసినా దైవారాధన కు ప్రాముఖ్యత ఎక్కువ.మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా మనకు మొదటిగా కనపడేది గంట. దేవాలయంలో గంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.గుడిలో హారతి సమయంలో,ప్రత్యేకమైన కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు.

అసలు దేవాలయం లో గంట ఎందుకు కొడతారు ? మనలో చాలా మందికి తెలియదు.గుడిలో కి వెళ్ళగానే ప్రదక్షిణలు చేసిన తరువాత గంట కొట్టి దేవుడిని దర్శించుకుంటాము.అయితే ఆలయం లో కొట్టే గంటకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి.దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను,వ్యతిరేఖ కిరణాలను దూరం చేస్తుంది. అంతే కాకుండా దేవుడు ముందు తమ కోరికను చెప్పుకుని గంట కొట్టడం ద్వారా ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం.

గంట మోగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతం గా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. గంట యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంట సకల దేవతా స్వరూపం గా భావించి ముందు గా గంటను కొడతారు. గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

గంట నాలుక భాగంలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది అని, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ, చక్ర , హనుమా, నందీశ్వరుడు ఉంటారు. హారతి సమయంలో అందరి దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు.ఇక పోతే కంచు గంట మోగించినపుడు దానిలో నుండి ఓం అనే శబ్దం విన వస్తుంది. ఈ ఓంకార నాదం వినడం వల్ల మనిషిలో ఉన్న చింతలు,సమస్యలు తొలిగి పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news