దేశం మొత్తం సంచలనం రేపుతోన్న యస్ బ్యాంక్ సంఖక్ష్లోభం వ్యవహారం మరో మలుపు తిరిగింది. యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ ను ఈడీ అరెస్టు చేసింది.DHFL మనీ ల్యాండరింగ్ కేసులో రాణాను 20 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు రాణా కపూర్ ని అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళారు.
అయితే విచారణలో తమకు సహకరించని కారణంగానే రాణా కపూర్ ని అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. యస్ బ్యాంక్ DHFL కు రూ. 4,450 కోట్లను రుణంగా ఇచ్చి అప్పుని తిరిగి రాబట్టుకోొలేని కారణంగా దివాళా తీసింది.
అయితే రాణా కపూర్ DHFLతో పాటు మరో కార్పొరేట్ సంస్థకు రుణాలు మంజూరు చేసిన విషయంలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన్ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరతామని అధికారులు చెబుతున్నారు.
బ్యాంక్ దివాళా తీసిన నేపథ్యంలో యస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, ఏటీెఎం సేవలు నిలిచిపోవడంతో కస్టమర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే…