సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. సాగునీరు వదలాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డెక్కినట్లు తెలుస్తోంది.రహదారిపై రాకపోకలను వారు నిలువరించారు. రోడ్డుపై కంప వేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
వనపర్తి జిల్లా జూరాల, గుంటిపల్లి, మోటంపల్లి, ఆరేపల్లి, కట్టేపల్లి, తూంపల్లి గ్రామాలలో పంటలు ఎండిపోతున్నాయని.. జూరాల ఎడమ కాలువ నుండి సాగునీరు విడుదల చేయాలని జూరాల ప్రాజెక్టుపై రైతుల ధర్నాకు దిగారు. నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని పోలీసులను రైతులు వేడుకుంటున్నారు. కాగా, సాగు నీరు అందక రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.