చైనా తప్పులు కుప్పలుగా పెరుగుతున్నా.. మారదా..? చైనా దుష్టబుద్ది

-

కరోనా విషయంలో చైనా చేసిన, చేస్తున్న తప్పులు… ఏంటి…? ప్రపంచాన్ని ఆ దేశం నిజంగా తప్పుదోవ పట్టించిందా…? చైనా చేసిన పెద్ద పెద్ద తప్పులు ఏంటీ…? ప్రపంచానికి ఈ గతి రావడానికి కారణం ఆ దేశమేనా…? అమెరికా చైనాను టార్గెట్ చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటీ…? చెప్పుకుంటూ పోతే సవా లక్ష ఉంటాయి. ఆ దేశం ప్రతీ ఒక్కటి ముందు నుంచి డ్రామాలు ఆడుతూనే వచ్చింది.

వ్యాధి సోకినవారు, మరణించిన వారి సంఖ్యను దాదాపు వంద రెట్లు తగ్గించి చూపించింది. ఊహాన్ స్మశానాల్లో దాదాపు 70 వేల అస్తికల కుండలను జనాలకు పంచారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి లెక్కలతో సహా తెలుసు. ఈ వైరస్ “మానవుల నుండి మానవులకు వ్యాపించదు” అని తాను అబద్దం చెప్పడమే కాకుండా WHO ద్వారా కూడా అబద్దాలు చెప్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మాటలపై ట్రంప్ ఇందుకే మండిపడేది.

ఈ వైరస్ గురించి తన సైంటిస్టులు ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించడమే కాకుండా మీడియా సహా కొన్ని వెబ్ సైట్స్ కథనాలు రాస్తే వాళ్ళను బెదిరించి మీరు ఏమీ రాయవద్దని వాస్తవాలను ప్రపంచానికి తెలియకుండా కప్పి పెట్టింది. వైద్యులను కూడా బెదిరించింది. కొంత మందిని చంపించింది డ్రాగన్. ఈ వైరస్ కు సీ ఫుడ్ మార్కెట్ కు లింక్ ఉంది అని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడమే కాకుండా ముసలమ్మకు వచ్చింది, త్రాచు పాములు తిన్నారని యేవో చెప్పింది.

ఊహాన్ లో వైరస్ ల్యాబ్ ఉందనే విషయం అమెరికా సిఐఏ చెప్తే… అడ్డంగా నోరేసుకుని పడిపోయింది చైనా మీడియా. ప్రపంచం చెప్పే మాట ఏంటీ అంటే… అత్యంత పటిష్ట నిఘా వ్యవస్థ ఉండే అమెరికా సహా… ఊహాన్ సి ఫుడ్ మార్కెట్ వద్ద వైరస్ గ్లాస్ పగిలిందని… అమెరికా, చైనా రెండూ ప్రమాదకరదేశాలే… కాని అమెరికాలో కాస్త పరిస్థితులు వేరుగా ఉంటాయి. ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ,

దేశాధ్యక్షుడిని అయినా బోనులో నిలబెట్టే చట్టబద్దపాలన అమెరికాలో ఉన్నాయి. ఇవేమీ లేని చైనా అమెరికా కన్నా వందల రెట్లు ప్రమాదకర దేశం. పైగా మనదేశం విషయం తీసుకుంటే, మనకు చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి కాబట్టి, మనదేశానికి చైనా ఇంకా ప్రమాదకరం అని భావిస్తూ ఉంటారు. అందుకే, మనదేశాన్ని, మన ప్రజలని ప్రేమించే వాళ్ళు అందరూ చైనా వస్తువుల కొనుగోలును వీలయినంత తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పలువురు.

ఈ చైనీస్ వైరస్ కారణంగా మనం 35 రోజులు మన పనులు అన్నీ మానుకుని ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. రైతులు, వలసకార్మికుల దగ్గరనుండి సినిమా కార్మికుల దాకా ప్రతి ఒక్కరం ఈ చైనీస్ వైరస్ వల్ల నష్టపోయాం. మనల్ని ఇంత దెబ్బ కొట్టిన చైనా వస్తువులని కేవలం చీప్ గా వస్తున్నాయి అని కొనుగోలు చేయడం అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం. అందుకే చైనా వస్తువుల వాడకాన్ని తగ్గిద్దాం, స్వదేశీ వస్తువులని ప్రోత్సహిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version