రూ.2వేల కోట్ల భూమిని ‘లులూ’గ్రూప్‌నకు 99ఏళ్లకు ఎలా లీజుకిస్తారు? : బొత్స సత్యనారాయణ

-

ఏపీలోని కూటమి ప్రభుత్వం లులూ గ్రూపునకు జరిపిన భూమి కేటాయింపులపై వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘2000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని ‘లులూ గ్రూప్‌’నకు ఏకంగా 99 ఏళ్ళకు లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటీ? భూమి ఒకటే కాకుండా 170 కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు? ఎకరా 100 కోట్లు విలువ చేసే భూమిలో సినిమా హాల్స్, రెస్టారెంట్ ల కోసం ఇంత చౌకగాఏ ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.

కాగా, విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూపున​కు విశాఖలో భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్​లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version