హైదరాబాద్‌లో తగ్గిపోతున్న ఆఫీస్ లీజులు.. ‘కొలియర్స్ ఇండియా’ నివేదిక

-

గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో రోజురోజుకీ ఆఫీస్ లీజింగ్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. జనవరి-మార్చి మధ్య 41 శాతం ఆఫీస్ లీజింగ్ పడిపోయినట్లు కొలియర్స్ ఇండియా సర్వే నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్‌కతా పట్టణాల్లో క్షీణించినట్లు సమాచారం.

జనవరి-మార్చి త్రైమాసికంలో ఇప్పటివరకు నమోదైన లావాదేవీల ఆధారంగా ఒక నివేదికను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ విడుదల చేసింది. టాప్-7 నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది మొదటి మూడు నెలల కాలంలోని లీజింగ్ 138 లక్షల (ఎస్ఎఫ్)తో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదై.. దేశ, విదేశీ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది. హైదరాబాద్‌లో 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే 41 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version