ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. నేను పొద్దుగాల 7 గంటలకే మా ఊరి బస్ స్టేజీ దగ్గర నిలబడి చెయ్యి అడ్డంపెట్టినా బస్ డ్రైవర్ ఆపడంలేదు.. ఇదేం పద్ధతి.. ఉచిత ప్రయాణమని పెట్టి బస్సులు ఆపకుండా మహిళలను అవమానిస్తే ఎట్లా..? అవసరమైతే టికెట్ కొట్టండి’ అంటూ ఓ మహిళ ఆర్టీసీ సిబ్బంది తీరపై అవేదన వ్యక్తం చేసింది. కంట్రోలర్ ఆఫీసుకు చేరుకొని ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను పైసల్ లేక రాలేదు. నా చేతిలో రూ.500 నోటు ఉన్నది. అవసరం అనుకుంటే టికెట్ తీసుకోండి అని వారిపై మండిపడ్డది .నా ఆధార్ కార్డుతో నీకు ఏం అవసరం అని నిలదీసింది. ఉచితమని చెప్పి మహిళనని చూసి బస్సు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించింది? ఆపతికి పోతుంటే ఇట్ల చేస్తే ఎట్లా. ఫ్రీ బస్సు పథకం అని పెట్టి.. ఎందుకు ఇంత మోసం చేస్తున్నరు? అంటూ నిలదీసింది. ఆమెతో పాటు బస్టాండ్ లో ఉన్న మరికొందరు మహిళలు కూడా ఆమెతో గొంతు కలిపారు. ‘అందరు డ్రైవర్లు అలాగే చేస్తున్నారు. మహిళలు కనిపిస్తే చాలు బస్సు ఆపడం లేదని ఓ మహిళ అసహనం వ్యక్తం చేసింది.