కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది .ఇందుకోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సమావేశాలు,సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటికే జిల్లాలు వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన ఆమె.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలం, బలహీనతలను గురించి తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీలో ప్రత్యేక హోదాకై దీక్షను చేపట్టిన తరువాత ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. గడిచిన పది సంవత్సరాల నుంచి స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో వైఎస్ షర్మిల ఉత్తేజాన్ని నింపుతున్నారు.
ఇదిలా ఉంటే…..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన రెండ్రోజుల పాటు వాయిదా పడింది. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు కోరుతూ ఢిల్లీలో దీక్ష చేసిన ఆమె వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో నేడు, రేపు జరగాల్సిన రచ్చబండ, బహిరంగ సభలు 7వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజు దర్శి, బాపట్లలో ఆమె పర్యటిస్తారు.