అయోధ్య రాముడికి ఎన్ని కోట్ల విరాళాలంటే?

-

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం లో బాల రాముడి రూపంలో కొలువుదీరిన శ్రీరాముని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిట కిటలాడుతుంది. బాల రాముడిని దర్శించుకొని విరాళాలు అందజేస్తున్నారు. దీంతో నెల రోజుల్లోనే రూ.25 కోట్ల విరాళాలు వచ్చినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు. గత నెల 22న జరిగిన ప్రతిష్ఠాపన తర్వాత ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. శ్రీరామ నవమి రోజు 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాగా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news