ఉల్లిపాయ గారి పొగరు ఎంతకు తగ్గింద౦టే…?

-

ఇన్నాళ్ళు ఉల్లి కొనాలంటే కాదు గాని చూడాలంటేనే భయపడే పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. పాపం ఆమ్లెట్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉల్లి పాయ కోసం ఆగిపోయారు అంటే పరిస్థితి ఎంత దారుణమో చూడండి. నాలుగు నెలలుగా ఉల్లి పాయగారి పొగరు దెబ్బకు వంటిల్లు కూడా కన్నీళ్లు పెట్టేసింది. మహారాష్ట్రలో పడిన వర్షాల దెబ్బకు పరిస్థితి అలా తయారు అయింది మరి.

ఇక ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. పంట చేతికి వచ్చేసింది, విదేశాల నుంచి దిగుమతులు పెరిగిపోయాయి, దీనితో ఉల్లి ధర ఇప్పుడు క్రమంగా తగ్గడ౦ మొదలయింది. కర్నూలు, రాయచూరులో హోలోసేల్‌ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.35కి పడిపోయింది అంటే ఏ స్థాయిలో తగ్గిందో చుడండి. ఇన్నాళ్ళు 200 పైగా పలికిన ధర ఇప్పుడు 40 లోపే పలుకుతుంది. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఉల్లి అందుబాటులోకి రావడంతో,

ఉల్లి పొగరు బహిరంగ మార్కెట్ లో భారీగా తగ్గింది. జనవరి చివరి వారంలో మరీ తగ్గుతుందని అంటున్నారు. ఫిబ్రవరిలో కిలో ఉల్లి రూ.20కే లభ్యమయ్యే అవకాశం ఉంది.సోమవారం ఆగ్రాలో కిలో ఉల్లి ధర రూ.50 పలకగా తమిళనాడులోని దిండిగల్‌లో ఉల్లి ధరలు కిలోకు రూ.20 తగ్గడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, అసోం, మేఘాలయా సహా కొన్ని రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news