కారులో ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?

-

కారులో ఏసీని రన్ చెయ్యడం వలన ఇంధన వినియోగం బాగా పెరుగుతుంది. చిన్న కార్లు సాధారణంగా 1.2 నుండి 1.5-లీటర్ ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. పెద్ద కార్లు 2.0 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. పెద్ద ఇంజన్ కెపాసిటీ ఉన్న వాహనాలు ఏసీని నడుపుతున్నప్పుడు ఎక్కువ పెట్రోల్ ని వినియోగిస్తాయి.చిన్న కార్లలో (1.2-1.5 లీటర్ ఇంజన్లు), ఒక గంట పాటు ACని రన్ చెయ్యడం వల్ల దాదాపు 0.2 నుండి 0.4 లీటర్ల పెట్రోలు ఖర్చు అవుతుంది.పెద్ద కార్లలో (2.0 లీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్లు), ఏసి వినియోగం వల్ల దాదాపు 0.5 నుండి 0.7 లీటర్లు ఉంటుంది.

వాహనం ఆపి, ఏసీ ఆన్‌లో ఉంచినా కూడా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. కార్ నడుపుతున్నప్పుడు ఏసీ వినియోగం కాస్త తక్కువగానే ఉన్నా ఏసీ వల్ల మైలేజీ తగ్గడం మాత్రం ఖాయం. అలాగే AC చాలా చల్లగా (తక్కువ ఉష్ణోగ్రత) సెట్ చేయబడితే, అప్పుడు కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. మీ కారు ఇంజిన్ పాతదయ్యి లేదా తక్కువ సామర్థ్యం కలిగి ఉంటే, ACని వాడటం వలన అధిక ఇంధన వినియోగం జరుగుతుంది. మీ మీ కారు మోడల్ ఇంకా అలాగే దాని వినియోగాన్ని బట్టి ఒక గంట పాటు ACని వాడితే 0.2 నుండి 0.7 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. మీరు మైలేజీని ఆదా చేయాలనుకుంటే బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేయండి, AC ఉష్ణోగ్రతను మితంగా ఉంచండి. వీలైతే ACని వీలైనంత తక్కువగా ఉపయోగించండి. దీని వల్ల మీ కార్ మైలేజ్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news