బెంగళూరులో వోల్వో బస్సు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం..!

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినప్పటికీ వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. రూల్స్ ను పట్టించుకోకుండా రూల్స్ ని బ్రేకు చేస్తూ అమాయక ప్రాణాలను బలిగొంటున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఫ్లై ఓవర్ పై మంగళవారం వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వోల్వో బస్సు అదుపు తప్పి ఇతర వాహనాల పైకి దూసుకెల్లింది. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. వోల్వో బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకు వెళ్లింది. దీంతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.  బెంగళూరు – హెబ్బ‌ల్ వద్ద బీఎమ్‌టిసి ఏసీ వోల్వో బస్సు అదుపు తప్పి పలు వాహనాల పైకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, నాలుగు బైకులు ధ్వంసం కాగా.. మరో ఇద్దరూ వ్యక్తులకు గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news