సాధారణంగా పిల్లల్ని పాఠశాలకి పంపే ముందు అక్షరాభ్యాసం వేడుకను నిర్వహిస్తారు. అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుందని నమ్మకం. అయితే అక్షరాభ్యాసం వేడుక ఎలా చేయాలి..? ఈ విషయం లోకి వస్తే…. అక్షరాభ్యాసాన్ని చేయించదలచిన రోజున బాబు లేదా పాపకి తల స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింప చేసి, పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కరించి…
విఘ్నేశ్వర పూజ, సరస్వతీ పూజ చేయించిన తర్వాత ఒక పళ్ళెం లో బియ్యం పోసి దానిని మూడు భాగాలుగా రెండు గీతలు గీసి మొదటి దానిలో ఓం అని… రెండవ దాంట్లో నమ శివాయ అని మూడవ భాగం లో సిద్ధం నమః అని మూడు పర్యాయములు పండితులు బాబు చేత రాయిస్తారు. ఆ తర్వాత విఘ్నేశ్వర, సరస్వతి శ్లోకమును పటించాలి.
ఇంట్లో ఉన్న పెద్దలు బాబుని ఒడి లో కూర్చోబెట్టి పలక మీద ”ఓం నమశ్శివాయ” అని ముందుగా రాయించి తర్వాత అక్షరాలు రాసి దిద్దించాలి. ఆ తరువాత తోటి చిన్న పిల్లలకి పాలక, బలపం, టేబుల్స్ బుక్, బిస్కెట్లు వంటివి పంచుతారు. దీనితో తోటి పిల్లలకి మీ బాబు పై ప్రేమానురాగాలు కలుగుతాయి. గురు, శుక్ర, మూఢముల లో అక్షరాభ్యాసాన్ని చేయకూడదు.