సుకన్య సమృద్ధి స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకువస్తూ ఉంటుంది. అయితే ఆడపిల్లలకు కూడా ప్రత్యేకంగా కొన్ని పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం తీసుకువచ్చిన పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఈ పథకంలో భాగంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజుల్లో వస్తువులు ధరలు, ఫీజులు పెరిగిపోతున్నాయి మరియు ఆడపిల్లలను చదివించి పెళ్లిళ్లు చేయాలి అంటే ఎంతో కష్టమనే చెప్పవచ్చు. అయితే ఆడపిల్ల పుట్టిన తర్వాత నుండి పొదుపు చేయడం ప్రారంభించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆడపిల్ల చిన్న వయసులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తారో పెళ్లి లేక చదువు కోసం ఆ డబ్బును ఉపయోగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఎక్కువ వడ్డీని కూడా పొందవచ్చు. అయితే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో రిటర్న్స్ కూడా తప్పకుండా వస్తాయి.

అర్హత వివరాలు:

10 ఏళ్ల లోపు ఉండే ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు మరియు ఒక కుటుంబం నుండి రెండు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు మాత్రమే ఉండాలి. ఒకవేళ రెండోసారి ఆడపిల్లలు కవలలుగా పుడితే మూడో ఎకౌంట్ తీసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి:

సుకన్య సమృద్ధి పథకం కోసం అకౌంట్ ను ఓపెన్ చేయాలి. దానికి సంబంధించి ఆడపిల్లల బర్త్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన ఎకౌంటు కు సంబంధించిన ఓపెనింగ్ ఫారం, తల్లితండ్రులు లేక గార్డియన్స్ యొక్క అడ్రస్ ప్రూఫ్ మరియు ఐడి ప్రూఫ్ ను ఉపయోగించి ఈ పథకానికి అప్లై చేయవచ్చు. అయితే అకౌంట్ కు సంబంధించి ఓపెనింగ్ ఫారం నింపిన తర్వాత తదితర డాక్యుమెంట్లు మరియు ఫోటోతో కలిపి పెట్టుబడి తో పాటుగా బ్యాంకులో ఇవ్వాలి. అయితే పెట్టుబడిగా 250 రూపాయల నుండి సుమారు 1,50,000 వరకు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 8.20% ఉంది. అయితే ఈ పథకంలో 15 ఏళ్ల పాటుగా పెట్టుబడి చేయడం వలన అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది లేక ఆడపిల్లకు 18 ఏళ్లు పూర్తి అయిన తర్వాత అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు. ఈ విధంగా 15 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 1,50,000 పెట్టుబడి పెట్టడం వలన వడ్డీతో పాటుగా మెచ్యూరిటీ సమయానికి 69,27,578 రూపాయలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news