సహజంగా ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి కూడా ఆధార్ అవసరం ఉంది. అందువల్ల ఆధార్‌లో వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
అయితే కొందరు ఆధార్ కార్డ్‌లో తప్పులు ఉంటాయి. మరియు వివాహం తర్వాత అమ్మాయి ఇంటి పేరు ఆధార్‌లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పెళ్లైన తర్వాత మహిళలు ఆధార్‌లో మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్‌లైన్ అప్‌డేట్:
– ముందుగా మీకు దగ్గరిలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
– సపోర్టింగ్ డాక్యుమెంట్లకు సంబంధించిన ఒరిజినల్ కాపీలను తీసుకుని వెళ్తే వాటిని ఆధార్ సెంటర్‌లో ఉన్నవారు స్కాన్ చేసుకొని వెనక్కు ఇస్తారు.
– తప్పుగా ఉన్న వివరాలను సరిచేస్తారు. అవసరం అనుకుంటే బయోమెట్రిక్ వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్‌కు వెలితే రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ అప్‌డేట్:
– ముందుగా యూఐడీఏఐ పోర్టల్‌కు వెళ్లి అధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి. మీ పేరు, ఇంటి పేరు ఎంటర్ చేయాలి.
– సెల్ఫ్ అటెస్ట్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోన్ చేయాలి.
– మీ రిజిస్టర్డ్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి మార్పులు చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.