ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముడుతోంది. ఎక్కడికక్కడ ప్రజలను తుదముట్టిస్తోంది. ఈ వైరస్ కారణం గా ఎవరు ఎప్పుడు ఎక్కడ చనిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పాతిక లక్షల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడగా 12 వేల మంది ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ కట్టడికి.. మందుల్లేవా? అంటే తలకోరకంగా చెబుతున్నారు. పారాసిట్మాల్ వేసుకోవాలని కొందరు. రద్దీకి దూరంగా ఉండాలని కొందరు ఇలా.. ఎవరికి తోచిన రీతిలో వారు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు కరోనాను నిర్మూలించే లేదా నియంత్రించే మందు మాత్రం ప్రత్యక్షంగా లేక పోవడం గమనార్హం.
మరి ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఇంకా మందు కనిపెట్టలేకపోవడం ఏంటి? ప్రపంచాన్ని గడిచిన మూడు మాసాలుగా ఈకరోనా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కదా? అంటే.. నిజమే అయినా ఇప్పటికీ మందులేద ని అంటున్నారు పరిశీలకులు. మరి ఎప్పటికి కరోనాకు మందు కనిపెడతారు? ఎప్పటికి కట్టడి చేస్తారు? అనే ప్రశ్నకు ఈ ఏడాది చివరలో! అనే సమాధానం వస్తోంది. దీనికి కూడా సరైన నిర్ధారణ లేనట్టే. అంటే దొంగ లు పడ్డ ఆరు నెల్లకు అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. కరోనాను నియంత్రించలేక పోవడం గమనా ర్హం.
దీంతో ఇప్పటికే కొన్ని దేశాలు యుద్ద ప్రాతిపదిక న టీకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అమెరికా, చైనా సహా ఐరోపా దేశాలైన బ్రిటన్, జర్మనీలు కరోనా టీకాను కనుకొనే విషయంలో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. అధునాతన సాంకేతికతను వినియోగించుకుని మరీ టీకాను తయారు చేయడంలో ఇప్పటికే తొలి ప్రయోగ దశను దాటాయి. అమెరికాలోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రిసెర్చ్ సంస్థ ప్రయోగాల్లో తొలి దశను దాటి మనుషలపై ప్రయోగాలు చేసే స్థాయికి చేరుకుంది.
ఇక, కరోనా బాధిత ప్రధాన దేశం చైనా కూడా టీకా తయారీలో ముందుంది. క్యాన్సినో బయోలాజిక్స్ మనుషులపై ప్రయోగాలను ప్రారంభించింది. అదేవిధంగా బ్రిటన్లోని ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు రూపొందించిన టీకాలను ఈ వారం నుంచి జంతువులపై ప్రయోగించనున్నారు. అయితే, ఇలా ఎన్ని ప్రయోగాలు ఎంత వేగంగా చేసినా.. ఇప్పటికిప్పుడు లేదా ఒక నెల వ్యవధిలో టీకాను కనుకొనే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. కరోనా కు ఈ ఏడాది చివరికి కానీ టాకీ లభ్యమయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు.,