ప్రపంచమే ఓ వింత! ఒకవైపు చల్లగా ప్రజల మనసులను దోచే ప్రకృతి! మరోవైపు.. గ్రీష్మగాలులతో ప్రజల ను హడలెత్తించే ప్రకృతి! ఒకచోట నిత్యం వర్షం.. మరోచోట చూద్దామన్నా కనిపించని నీటి చుక్క! చుట్టూ స ముద్రాలు.. తాగేందుకు పనికిరాని నీరు! ఒకవైపు రాతి కొండలు. మరోవైపు అగ్ని శిఖరాలు! ఏ క్షణాన పేలు తాయో చెప్పలేని పరిస్థితులు. ఇలా ప్రకృతిలో జరిగే మార్పు, ప్రకృతిలో చోటు చేసుకునే పరిణామాలను లె క్కగట్టడం, వాటిని ఛేదించడం మానవాళికి పెను సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో మరో కీలక పరిణా మం.,. ప్రకృతి నుంచే జనియించే వైరస్ భూతాలు. కంటికి కనిపించే శత్రువుతో పోరాడొచ్చు. కానీ, కంటికి క నిపించకుండా.. ప్రజల ఆయువును తీసే ఈ మహమ్మారులు ఎప్పుడూ కూడా సవాళ్లు రువ్వుతూనే ఉన్నా యి.
ప్రస్తుతం కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతోంది. కొన్ని రోజుల కిందట పక్క దేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం మనదేశంలోకి ప్రవేశించి, ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపె డుతోంది. అయితే, ఇది ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయాలపై క్లారిటీలేదు. చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసి న ఈ వైరస్ తొలుత పాముల నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు. తర్వాత జరిగిన మరణాల నేపథ్యంలో అసలు ఇది ఎలా ప్రవేశించింది? అనే దానికి ప్రాధమిక నిర్దారణ అయితే ఇప్పటికీ చె్ప్పలేక పోతున్నారు. మరోవైపు ఈ మహమ్మారికి ఇంకా మందు కనుక్కోలేదు.
అదేసమయంలో టీకా కూడా లేదని, ముందస్తు జాగ్రత్తలతోనే దీనిని నివారించాలని వైద్యులు, ప్రభు త్వం పిలుపునిస్తోంది. అయితే, గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతి వందేళ్లకు ఓ మహమ్మారి ఇలా ప్రజల ప్రాణాలకు పెనుముప్పులా పరిణవిుంచాయని తెలుస్తోంది. మూడు పర్యాయాలు వచ్చిన ఆయా రకాల వ్యాధులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యాధుల సరసన కరోనా (కోవిడ్–19) చేరిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వణికించిన ప్లేగు క్షణాల్లో సోకే ప్లేగు వ్యాధిని మానవ వినాశనిగా చెప్పవచ్చు.నల్లని పెద్ద ఎముకల మూలంగా సోకే డిసీజ్ ఇది. ఈ వ్యాధి 1720 ప్రాంతంలో వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది.
ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం తర్వాత కలరా వ్యాధి సోకింది. ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రబలిన ఈ వ్యాధి బారిన పడి లక్షల మంది మృత్యువాత పడ్డారు. కలరా వ్యాధిని అతిసార వ్యాధి అనికూడా పిలుస్తుంటారు. ‘విబ్రియో కలరే’అనే సూక్ష్మ క్రిమి కారణంగా కలరా సోకుతుం ది. దేశంలోని కోల్‌కతా నగరంలో తొలిసారి కలరా ప్రబలింది. ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ 1820లో మాత్రం యూరప్ వరకూ వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు కలరా మూలంగా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా లక్ష మందికి పైగానే చనిపోయారు. ఇలా ప్రతి వందేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని ఏదో ఒక విపత్తు ప్రాణాలను హరిస్తోందనే విషయం ఆసక్తిగా ఉందని అంటున్నారు నిపుణులు.