ఇంట్లో ఎలుకలు ఉంటే..ఇక ఆ గృహిణికి ఉండే తలనొప్పి అంతా ఇంతాకాదు. వంటగదిలో ఆగం ఆగం చేస్తాయి. వీటిని పట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే..వివిధ రకాల స్ప్రేలు, పెస్టిసైడ్స్ వాడుతుంటారు. కానీ వీటిలోని కెమికల్స్ వల్ల మనకు హాని కలుగుతుంది. ఒకవేళ ఎలుకలు వీటివల్ల చనిపోయినా ఎక్కడో కన్నాల్లోనే, రూఫ్ మీదనే చచ్చిపోతుంటాయి. ఇది చచ్చిపోయి చెడు వాసన వచ్చే వరకూ మనకు అవి పోయాయ్ అని తెలియదు. ఇంకోటి..ఓ పక్క పూజిస్తూనే..వాటిని చంపటం కూడా పాపమే కదా..గణపతికి ఎలుకలంటే మహా ఇష్టం. మరి అలా అని..ఎలుకలను అలానే వదిలేస్తే..అవి కొరికిన వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా ఇంట్లోంచి ఎలుకల ముఠాను తరిమికొట్టొచ్చు.
మీ ఇంట్లో లెక్కలేనన్ని ఎలుకలు ఉంటే ఓ పాత గుడ్డపై కారాన్ని చల్లి ఆ గుడ్డను ఓ సంచిలో వేసి ఎలుకల రంధ్రాల దగ్గర ఉంచండి. కారం అంటే చాలు ఎలుకలు తట్టుకోలేవు. ఎలుకలే కాదు చీమలు, బొద్దింకలు, పురుగులకు కూడా కారం అంటే నచ్చదు. ఆ మంటకు వెళ్లిపోతాయి.
లవంగాలు మనకు మంచి దినుసులు. ఆ వాసనంటే మనకు ఇష్టం..కానీ ఎలుకలకు కడుపులో తిప్పుతుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు… ఎలుకలకు పిచ్చిలేస్తుందట. తమకు బద్ధ శత్రువుల్లా ఫీలవుతాయి. ఎలుకలు వెళ్లే కన్నాల దగ్గర… చిన్నచిన్న గుడ్డల్లో కొద్దిగా లవంగాల్ని ఉంచండి. అంతే… ఎలుకలు ఇక ఈ ఇంట్లో ఉండటం మన వల్ల కాదురా బాబు అనుకోని జంప్ అవుతాయి.
ఇన్ని విధాలుగా ప్రయత్నించినా..ఫలితం లేకపోతే…తినే సోడా ఇంట్లోని ఎలుకలు తిరిగే ప్రాంతాలన్నింటిలో చల్లండి. ఆ రాత్రి అవి ఎలాగూ పారిపోతాయి. అప్పటికీ వెళ్లకపోతే..తెల్లారే తినేసోడాను చీపురుతో అటూ ఇటూ కదపండి. అంతే… అక్కడి గాలిలో తినేసోడా కలుస్తుంది. ఆ దుమ్మును పీల్చితే చాలు ఎలుకలు..అసలు ఉండలేవు. పరుగులు తీస్తాయి.
ఈ పద్ధతులు ద్వారా ఎలుకల్ని వదిలించుకోవచ్చు. ఎలుకలు చనిపోవు. దగ్గర్లోని ఏ పొలాలకో వెళ్లిపోతాయి. తద్వారా మీరు వాటికి హాని చేసినట్లు అవ్వదు.
-triveni