వీట్ గ్రాస్ జ్యూస్..దీన్నే చాలామంది గ్రీన్ బ్లడ్ అంటారు. గోధుమ గడ్డి రసాన్ని తాగితే..ఆకుపచ్చ రక్తాన్ని తాగినట్లే..అంటే లోపలికి వెళ్లి రక్తంగా మారడమే..డైరెక్టుగా బ్లడ్ పట్టడానికి అద్భుతమైన గడ్డి. ఎన్నో సంవత్సరాల నుంచి నాచురోపతి విధానంలో రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్య ఉన్నవారికి ఈ గడ్డిని వాడుతున్నారు. ఇది ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అయితే ఇది వాడుకుందాం అన్నా చాలా చోట్ల దొరకని పరిస్థితి ఉంది.
కాబట్టి వీట్ గ్రాస్ ను ఇంట్లోనే పండించుకుని..ఖర్చు తక్కువలో మంచి లాభాలు పొందవచ్చు. వెజిటబుల్ జ్యూస్ బంగారమైతే…వీట్ గ్రాస్ వజ్రంతో సమానం. ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు చాలామంది ఇళ్లలోనే కూరగాయలు పెంచుకుంటున్నారు. ఇంట్లో పండినవి తినటానికి ఇష్టపడుతున్నారు. రసాయనాలు, పురుగులమందులు లేనివాటిని వాడటానికే అందరూ ఇష్టపడుతున్నారు.. కాబట్టి అలా పెంచుకునేవాళ్లు..గోధుమ గడ్డిని కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది..కేవలం జబ్బులు ఉన్నవాళ్లేకాదు..రక్షణ వ్యవస్థకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చంటిపిల్లల నుంచి ముసలివారి వరకూ అందరూ తాగొచ్చు.
వీట్ గ్రాస్ ను పెంచుకునే విధానం
ప్లాస్టిక్ ట్రేలు 8-10 తీసుకోండి. అడుగు అడుగున్నర పొడవు, వెడల్పు అడుగు, లోతు ఒక గుప్పెడు లోతులో ఉండేవి తీసుకోండి. వాటికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టండి. అందులో కొబ్బరిపొట్టులో మట్టి కలిపి పోసుకోండి. మంచి క్యాలిటీ గోధుమలను తీసుకోండి. మొక్కలు వస్తున్నాయా లేదా అని మనం మొలకెత్తే విత్తనాలు నానపెట్టినట్లు ఒక రోజు వీటని కూడా నానపెట్టి చెక్ చేయండి. మొక్కలు వస్తున్నాయంటే..ఇక ఒక దోశడు గోధుమలు 12 గంటలు నానపెట్టండి.
ఆ తర్వాత కుండీల్లో చల్లేసి..పైన మట్టిపోర వేసి కప్పేయండి. నీళ్లు చిలకండి. అలా ఉంచేస్తే..గోధుమలకు మొలకలు వస్తాయి. ఒకేరోజు అన్నీ ట్రేలలో విత్తనాలు వేయకూడదు..ఒక్కోరోజు ఒక్కో ట్రేలో వేయండి. మొదటిరోజు వేసిన ట్రేలో వారానికి గడ్డి వచ్చేస్తుంది. డైలీ నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. వరండాల్లో, బాల్కనీల్లో అయితే చాలు..ఎక్కువ ఎండ అక్కర్లా..4 అంగులాలు గడ్డి అయిన తర్వాత..అది కత్తిరించుకుని వాడుకోవచ్చు. వేరు లోపల ఉంది కాబట్టి దానికి మళ్లీ చిగురు వచ్చేస్తుంది.
కత్తిరించిని గడ్డిని కడిగేసేయండి..కొన్ని వాటర్ పోసి మిక్సీలో వేసేయండి. మెత్తగా నలిగాక ఫిల్టర్ చేయండి. అందులో కాస్త తేనె, ఎండు ఖర్జూరం పొడి కలుపుకుని తాగేయొచ్చు. పసర వాసన వస్తుంది అంతే..ఇది అలా తాగితే…రక్తం తాగినట్లే. ఈ పసరును 4రోజుల వరకూ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.
ఒకసారి కట్టింగ్ అయిన తర్వాత..మళ్లీ రెండోసారి కట్టింగ్ వరకూ ఉంచండి. ఆ తర్వాత ఆ మట్టిని తీసేసి మళ్లీ ఫ్రష్ గా చేసుకోండి. మేడమీద ఎండలో పెట్టకండి. సెమీషేడ్ ఉండాలి. కాస్త శ్రమతో కూడుకున్న పని అయినా..ఓపిగ్గా చేస్తే ఎంతో లభం. రక్తం తక్కువైనవారికి ఇది అమృతం లాంటిదే..ఈ జ్యూస్ ఒక్కటి తాగితే చాలు..ఫ్రూట్ జ్యూస్, వెజిటెబుల్ జ్యూస్ కూడా తాగక్కర్లేదు.
కాబట్టి పెరట్లో మొక్కలు పెంచుకునే వారికి ఎలాగో వాటిపై అవగాన ఉంటుంది కాబట్టి..ఈసారి ఇవి కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఒక్కో గ్లాస్ జ్యూస్ తాగుతూ ఉన్నారంటే..ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే.
-Triveni Buskarowthu