భారత మహిళా డాక్టర్ ని అమెరికాలో ఎలా గౌరవించారో చూడండి…!వైరల్ వీడియో;

-

కరోనా వైరస్ పై వైద్యులు చేస్తున్న పోరాటాన్ని ఏ విధంగా చెప్పినా సరే తక్కువే అవుతుంది. రోజు రోజుకి తీవ్రమవుతున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ వైద్యులు తీవ్ర స్థాయిలో తమ ప్రాణాలను కూడా కాదని పోరాటం చేస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఎలా ఎవరు చూసినా సరే ప్రజల ప్రాణాలను రక్షించడానికి తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. దీనితో ప్రభుత్వాలు వారిని గౌరవిస్తున్నాయి.

వారి త్యాగాన్ని గుర్తించడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ మార్గాల్లో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాగే అమెరికాలో మన భారత సంతతి వైద్యురాలిని ఇలాగే గౌరవించారు అమెరికాలో. మైసూర్‌కు చెందిన డాక్టర్ ఉమా మధుసూదన్ ని ఇటీవల తన ఇంటి ముందు కవాతుతో సత్కరించారు. ఈ వీడియోను నటుడు ఆదిల్ హుస్సేన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతుంది.

“అమెరికాలోని సౌత్ విండ్సర్ హాస్పిటల్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఆమె… చేసిన అసాధారణమైన సేవకు గుర్తింపుగా, మైసూర్‌కు చెందిన డాక్టర్ ఉమా మధుసూదన్ ని తన ఇంటి ముందు ఈ విధంగా సత్కరించారు. ఆమెకు వందనం స్వీకరించడాన్ని మీరు చూడవచ్చు” అని వీడియో పోస్ట్ చేసారు. క్లిప్‌లో ప్రజలు తమ కార్లను నడుపుతూ, పోలీసు కార్లు మరియు ఫైర్ ఇంజిన్‌లతో ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఉమా తన ఇంటి పెరట్లో నిలబడి వందనం స్వీకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version