ఎన్టీఆర్, బాలయ్య దగ్గరయ్యారా…?

-

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిణామం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కావాలి కుటుంబం అంతా కూడా అగ్గారగా ఉండాలి అని. కాని అది మాత్రం నెరవేరే విధంగా కనపడటం లేదు. సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి. అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసే పరిణామం అది. బాలకృష్ణ… దగ్గర కావాలని చూస్తున్నా జూనియర్ దూరంగా ఉన్నారు.

అయితే అరవింద సమేత సినిమా సమయంలో వీళ్ళు కలిసారు. ఆ సినిమా కార్యక్రమానికి బాలకృష్ణ వచ్చారు. మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కార్యక్రమానికి వచ్చాడు తారక్. ఆ తర్వాత వీళ్ళు కలిసిపోయారు అని భావించారు. కాని దూరంగానే ఉన్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తుందని అన్నారు.

కాని దీనికి తారక్ ఓకే చెప్పలేదని సినిమా ఆగిపోయింది అన్నారు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన చాలెంజ్ కి రాజమౌళి స్పందించారు. దానికి తారక్ ని నామినేట్ చేయగా తారక్… బాలకృష్ణ ను నామినేట్ చేసారు. బాల బాబాయ్ అంటూ ట్వీట్ చేసారు. దీనితో ఈ ఇద్దరు దగ్గరయ్యారని వీళ్ళు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version