ORS, పన్నీర్ తర్వాత వెలుగులోకి వచ్చిన నకిలీ వెల్లుల్లి.. ఎలా గుర్తించాలంటే ..?

-

మార్కెట్లో దొరికే అనేక వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆహార పదార్థాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. నకిలీ వెల్లుల్లిని ఎలా గుర్తించొచ్చు..? నకిలీ వెల్లుల్లిపాయల్ని మీరు గుర్తించినట్లయితే కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మార్కెట్లో సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్లిపాయలు కలకలం రేపుతున్నాయి. ఒక మహిళ 250 గ్రాముల వెల్లుల్లిపాయల్ని కొనుగోలు చేసింది. వాటిని కట్ చేయడానికి ప్రయత్నించగా.. సిమెంట్ కోటింగ్ గా కనపడింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఇలా సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్లిపాయల్ని అమ్మి మోసం చేస్తున్నారు. 300 నుంచి 350 వరకు ఒక కేజీ వెల్లుల్లిపాయలు ధర పలుకుతోంది. నకిలీ వెల్లుల్లిపాయలు ఎలా గుర్తించో తెలుసుకుంటే ఇలాంటి బాధలు ఉండవు. నిజమైన వెల్లుల్లిపాయలు కాస్త గట్టిగా ఉంటాయి. అలాగే నీళ్లల్లో వేసినప్పుడు వెల్లుల్లిపాయలు మునిగిపోతాయి. అదే నకిలీ వెల్లుల్లిపాయలు అయితే తేలుతాయి. ఈసారి మీరు నకిలీ వెల్లుల్లిపాయల్ని గుర్తించాలంటే ఇలా వాటర్ లో వేసి చూడండి. అలాగే స్వచ్ఛమైన వెల్లుల్లిపాయలు వాసన ఎప్పుడూ కూడా ఘాటుగా ఉంటుంది. నకిలీ వెల్లుల్లిపాయలు అయితే వాసన రావు.

ఏదైనా ఆర్టిఫిషియల్ స్మెల్ వస్తాయి తప్ప ఘాటైన వాసన కలిగి ఉండవు. ఇది వరకు మార్కెట్లోకి నకిలీ ORS, నకిలీ పన్నీర్ వచ్చాయి. అలాగే ఇప్పుడు నకిలీ వెల్లుల్లిపాయలు వస్తున్నాయి. ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అనేక సమస్యలను తొలగిస్తుంది. వెల్లుల్లిపాయల్ని వంటల్లో వాడటం మంచిదే. వెల్లుల్లిపాయలు తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. అయితే వెల్లుల్లిపాయల్ని వాడేటప్పుడు మాత్రం నకిలీ వెల్లుల్లిపాయల్ని ఉపయోగించద్దు. దీనివలన అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news