ఉల్లిపాయ‌ల‌తో టీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!

-

ఉద‌యాన్నే గొంతులో చాయ్ బొట్టు ప‌డ‌నిదే చాలా మందికి స‌హించ‌దు. ఏ ప‌నీ చేయబుద్ది కాదు. టీ తాగిన తరువాతే చాలా మంది త‌మ దైనందిన కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. అయితే సాధార‌ణ టీకి బ‌దులుగా ఆ స‌మ‌యంలో ఉల్లిపాయల టీ తాగితే ఎంతో మంచిది. దాంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో.. ఉల్లిపాయల టీని అస‌లు ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

how to prepare onion tea and what are its health benefits

ఉల్లిపాయ‌ల టీని ఇలా త‌యారు చేయాలి…

కావ‌ల్సిన ప‌దార్థాలు:

త‌రిగిన ఉల్లిపాయ – 1
వెల్లుల్లి రెబ్బ‌లు – 2 లేదా 3
బిర్యానీ ఆకు – 2
తేనె – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు – 2 క‌ప్పులు

త‌యారీ విధానం:

ఒక‌పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి 2 నుంచి 4 నిమిషాల పాటు మీడియం మంట‌పై మ‌రిగించాలి. అనంత‌రం మ‌రుగుతున్న నీటిలో త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేయాలి. 2 నిమిషాల త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అందులో వేయాలి. అనంత‌రం బిర్యానీ ఆకులను చిన్న చిన్న పీసులుగా క‌ట్ చేసి వేయాలి. మ‌రో 10 నిమిషాల పాటు ఆ మిశ్ర‌మాన్ని మ‌ర‌గ‌నివ్వాలి. దీంతో ఆ నీరు డార్క్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. అంతే.. ఉల్లిపాయ‌ల టీ త‌యారైన‌ట్లే. అందులో కొద్దిగా తేనె క‌లుపుకుని దాన్ని వేడిగా ఉండ‌గానే తాగేయాలి. ఇలా నిత్యం ఉద‌యాన్నే ఈ టీ తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.

ఉల్లిపాయల టీతో క‌లిగే లాభాలు…

* ద‌గ్గు, జ‌లుబు ఉన్న వారు ఉల్లిపాయ‌ల టీ తాగితే వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే జ్వ‌రం కూడా త‌గ్గుతుంది. శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌కు ఈ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది.

* హైబీపీ ఉన్న‌వారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

* టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ఉల్లిపాయ‌ల టీని తాగితే మంచిది. వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో అవ‌య‌వాలు శుభ్రంగా మారుతాయి.

* ఉల్లిపాయ‌ల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news