చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధపడతారు. ప్రతి ఒక్కరి రుతుక్రమం ఒకే విధంగా ఉండదు. కొంతమంది విపరీతమైన నొప్పిని ఎదుర్కొంటారు. దీనిని తగ్గించుకోవడానికి ఇలా చేయండి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క ఎంతో సహాయపడుతుంది. మన వంటింట్లో లభించే ఈ దాల్చిన చెక్కలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను రోగాలను తగ్గించడానికి ఆయుర్వేదంలో మాత్రమే కాకుండా మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది.
కేవలం వంటల రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పిని తట్టుకోలేకపోతుంటే టాబ్లెట్స్ వంటివి తీసుకోవడం సహజమే. కాకపోతే వాటి వలన ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక రుతుక్రమంలో నొప్పితో ఇబ్బంది పడుతుంటే బియ్యం కడిగిన నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకొని కలపాలి. ఇలా కలిపి ఉంచిన మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఒక్కో గ్లాస్ చొప్పున తాగితే రుతుక్రమంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో కూడా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు. ఇలా చేసినా సరే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క పొడిను నీటిలో కలిపి తీసుకోవడం మాత్రమే కాకుండా తేనె తో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన నొప్పి తగ్గుతుంది. కేవలం రుతుక్రమంలో వచ్చే నొప్పి మాత్రమే కాకుండా తలనొప్పిని తగ్గించుకోవడానికి కూడా దాల్చిన చెక్క పొడి ఎంతో ఉపయోగపడుతుంది అనే చెప్పవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు నుదుటి పై దాల్చిన చెక్క పొడిను రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ప్రతిరోజు దాల్చిన చెక్కను లేక దాల్చిన చెక్క పొడిను నీటిలో మరిగించి త్రాగడం వలన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.