ఈడీ ఆఫీస్ కు బయలుదేరిన కేటీఆర్

-

ఈడీ ఆఫీస్ కు బయలుదేరారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్. తన గండిపేట ఫాంహౌస్ నుంచి ఈడీ ఆఫీస్ కు కేటీఆర్ బయలుదేరడం జరిగింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర ను విచారించన్నారు ఈడీ అధికారులు. ఇలాంటి నేపథ్యంలో… ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడి అధికారులు విచారణ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

KTR left for ED office

గత నాలుగు రోజుల కిందట.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఆరోజు కూడా… ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారణ చేశారు. ఆ తర్వాత మళ్లీ విచారణకు పిలుస్తామని కేటీఆర్ కు చెప్పడం జరిగింది. ఇక ఇవాళ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఈడి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగే లేదని పదేపదే కేటీఆర్ చెప్పడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news