ఓ వైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నారీ లోకం, విద్యార్థి లోకం, సెలబ్రిటీ లోకం ఇలా ప్రతి ఒక్కరు సజ్జనార్‌తో పాటు తెలంగాణ పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సజ్జనార్‌కు తాజాగా షాక్ తగిలింది.
జాతీయ మానవ హక్కుల సంఘం దిశ కేసుల ఎన్‌కౌంటర్‌పై సూమోటోగా రియాక్టయ్యింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా వెంటనే స్పందించిన మానవ హక్కుల సంఘం పోలీసులు కస్టడీలో, అదుపులో ఉన్న వ్యక్తులు ఎలా ఎన్‌కౌంటర్‌కు గురవుతారని విస్మయం వ్యక్తం చేసింది మానవ హక్కుల సంఘం. దీనిపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఇక్కడ నిజానిజాలు తెలుసుకునేందుకు వాస్తవాలు విచారించేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపాలని ఎన్.హెచ్.ఆర్.సీ. నిర్ణయించింది. నిజనిర్ధారణ బృందాన్ని పంపి, వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకోవాలని ఎన్.హెచ్.ఆర్.సీ. తీర్మానించింది. మరి కాసేపట్లోనే ఈ బృందం హైదరాబాద్‌కు బయలే దేరనుంది.