ప్రియుడితో కలిసి భర్త హత్య…ఆ తరవాత..!

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడు అనే కారణం తో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తరవాత సూసైడ్ చేసుకున్నాడని కట్టుకథ అల్లింది. కానీ పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కెల మంగళం లో చోటు చేసుకుంది. రూప, అయ్యప్ప ఇద్దరూ భార్యా భర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయ్యప్ప లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే రూప కొంతకాలంగా తమ దూరపు బంధువు అయిన తంగమని అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.

మూడు నెలల క్రితం ఇద్దరూ ఇంటి నుండి కూడా పారిపోయారు. అయితే పది రోజుల క్రితం వారి బంధువులు పట్టుకుని ఇళ్లకు పంపించారు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన రూప భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దాంతో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్త ను ఊపిరి ఆడకుండా చేసి ఇద్దరూ హతమార్చారు. అనంతరం ఆత్మ హత్య అని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణ లో అసలు నిజం బయట పడింది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.