ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో భారీ మార్పులు చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ మార్పులు చేర్పులు చేశారు. మావోయిస్టులను సైతం ఎదుర్కొనే విధంగా సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీం ను చేర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న NSG, SSG స్థానిక సాయుధ బలగాలకు అదనంగా మరో ఆరుగురు కమాండలతో ఈ కౌంటర్ యాక్షన్ టీం సీఎం చంద్రబాబుకు భద్రత ఇవ్వనున్నది. ఈ కౌంటర్ యాక్షన్ టీంకు ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు.
అయితే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడుల నేపథ్యంలో y+ కేటగిరి సెక్యూరిటీ కాస్త 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ యాక్సిడెంట్ కూడా సీఎం భద్రత వలయంలోకి రానుంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు భద్రత ఇకపై కట్టుదిక్కంగా మారింది.