మాణిక్యధార కొండపై విపరీతమైన భక్తుల రద్దీ.. జారిపడిపోయిన పలువురు!

-

కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులోని మాణిక్యధార కొండకు భక్తులు భారీగా పోటెత్తారు. కొండపైకి వెళ్లేందుకు స్థానిక అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాళ్లతో రోప్‌లను అమర్చారు.క్యూలైన్ల వలే రోపులను పట్టుకుని భక్తజన సందోహం కొండపైకి ఎక్కుతున్నారు. అయితే, భక్తుల రద్దీ అధికం కావడంతో కొండపై ఒక్కసారిగా తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడింది.

ఎక్కడికక్కడ భక్తులు నిలిచిపోయారు.పరిమితికి మించి భక్తులు రావడంతో మాణిక్యధార కొండపైన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కొండపై నుంచి జారి పడిపోవడంతో సుమారు 10 మందికి గాయాలు అయినట్లు సమాచారం. తాళ్ల సాయంతో అక్కడి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి భక్తులను రక్షించారు.అనంతరం వారికి మెడికల్ సౌకర్యం కల్పించారు. రద్దీ విపరీతంగా ఉన్నందున ప్రస్తుతానికి భక్తులను కొండపైకి వెళ్లకుండా నిలిపివేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version