TS 09 FH 9999.. వామ్మో.. ఈ నెంబర్ కు అన్ని లక్షలా.. ?

-

ఫ్యాన్సీ నంబర్లంటే కొందరికి చాలా మోజు.. ఎంత ఖర్చయినా సరే. ఆ నెంబర్ దక్కించుకోవాల్సిందే అనుకుంటారు. ఇక కోటీశ్వరులకైతే.. కారు ఎంత స్టేటస్ సింబలో.. దాని నెంబర్ కూడా అంతే స్టేటస్ సింబల్.. ఇక సెలబ్రెటీల సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు.

కొంతమంది ఈ నెంబర్ కోసం దాదాపు కారు కొనేందుకు చేసినంత ఖర్చు నెంబర్ కు కూడా చేస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లను ఎంత ఖరీదైనా వేలంలో దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. బుధవారం ఖైరతాబాద్లోని రవాణా మధ్య మండలంలో ఫ్యాన్సీ నంబర్లకు వేలం జరిగింది.

టీఎస్ 09 ఎఫ్ హెచ్ 9999 నంబరు రూ. 10.35 లక్షలు పలికింది. ఈ నంబరును ట్రాక్స్ అండ్ టవర్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ తమ సంస్థ దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్ 0009 నంబరును గణపతివరం పోర్టు సంస్థకు రూ.4.01 లక్షలకు దక్కించుకుంది. అదే సిరీలో 0099 నంబరును ఈటా స్టూడియో రూ. 2.97 లక్షలు చెల్లించి దక్కించుకుంది.

మొత్తం మీద ఈ ఫ్యాన్సీ నెంబర్ల మోజు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారింది. ఒక్క రోజులోనే పలు నంబర్ల ద్వారా రవాణా శాఖకు రూ. 27 లక్షల ఆదాయం వచ్చిందంటే ఈ ఫ్యాన్సీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version