వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..

-

ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు విచ్చేసారు. దీంతో.. ఆదివారం ఉదయానికి వైకుంఠం క్యూ కంప్లెక్స్ లోని 23 కంపార్టుమెంటుల్లో భక్తులు నిండి ఉన్నారు. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలవారు కూడా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని ప్రకటించారు టీటీడీ అధికారులు.

శనివారం ఒక్కరోజే 76,324 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శనివారం 38,710 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో స్వామి వారికీ నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version