ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ రాకేష్ అనే యువకుడు నివాసముంటున్నాడు. 2017లో అతడికి వివాహం జరిగింది. ఆ దంపతులకు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటి సమస్య పరిష్కారం కావాలని రాకేష్ అతని తల్లి ఓ మంత్రగాడి వద్దకు వెళ్లారు. మీ ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే నీ భార్యను మూడు నెలల పాటు ఇక్కడే వదిలేసి వెళ్లాలని మంత్రగాడు రాకేష్ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పాడు.
మంత్రగాడి మాటలు నమ్మిన రాకేష్, అతడి తల్లి రెండు నెలల క్రితం భార్యను మంత్రగాడి ఇంట్లో వదిలేశారు. మహిళా, రెండేళ్ల కొడుకును రూమ్ లో పెట్టి తాళం వేసిన మంత్రగాడు వివాహిత మహిళ మీద అత్యాచారం చేస్తున్నాడు. కన్న కొడుకు మీద మంత్రగాడు అత్యాచారం చేయడంతో ఆమె ఏమీ చేయలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక నరకం అనుభవించింది. రెండు రోజుల క్రితం మంత్రగాడు పొరపాటున అతని మొబైల్ ఫోన్ మహిళ ఉన్న రూమ్ లో వదిలేసి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో మహిళ ఆమె తల్లి కి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది.
మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు మంత్రగాడి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె బిడ్డని రక్షించారు. మంత్రగాడి తో పాటు మహిళ భర్త, అతని తల్లి తప్పించుకున్నారని వారి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.