తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడు మైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే.. మొదటగా తిరుమల శ్రీవారియే ముందు వరుసలో ఉంటారు. నిత్యం శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్లకు పైగానే ఉంటుంది. అయితే తాజాగా తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాలని విరాళంగా అందించారు.
స్వామి వారికి ఎంతో భక్తి తో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం వీఐపీ విరామసమయంలో టిటిడి అదనపు ఏవి ధర్మారెడ్డి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్ కు అలంకరించే లా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు. 5.5 కిలోల బరువు గల బంగారు హస్తల తయారీ కి ఏకంగా.. 3.5 కోట్ల విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి మరియు వరద హస్తాలను అలంకరించి నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తితో చేసిన విరాళ మనీ.. ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో అతడి సమాచారాన్ని గోప్యంగా ఉంచింది టీటీడీ పాలకమండలి.