పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. సమంత ఐటెం సాంగ్ రిలీజ్!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. అందరూ ఎదురు చూస్తున్నా… పుష్ప ఐటమ్ సాంగ్ విడుదల ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు చిత్ర బృందం. ఊ అంటావా.. ఉహు అంటావా అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది పుష్ప చిత్ర బృందం.

ఈ ఐటమ్ సాంగ్ లో టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటపై అందరిలోనూ.. ఎక్స్పెక్టేషన్స్.. పీక్ స్టేజ్ కి వెళ్ళాయి. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు అలాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version