బంగారం, వెండి రేటు ఢ‌మాల్‌… భారీగా ప‌డిన రేటు

-

అంతర్జాతీయ మార్కెట్లో ప‌ది రోజుల వ‌ర‌కు బంగారం రేట్లు ఎలా భ‌గ్గుమ‌న్నాయో చూశాం. పది రోజుల వరకు బంగారం లైఫ్ టైం టాప్ రేటుకు చేరిపోయింది. వెండి కూడా బంగారం రేటు ఫాలో అవుతూ జెట్‌ రాకెట్ స్పీడ్తో దూసుకుపోయింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రోజురోజుకు రూపాయి బ‌ల‌పడుతుండడంతో బంగారం రేటు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వెండి రేటు కూడా తగ్గుతోంది.

5 రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ఏకంగా 40 వేల మార్క్‌ క్రాస్ చేసి బంగారం జీవిత చరిత్రలోనే అత్యధిక రేటు ట‌చ్ చేసి రికార్డులకెక్కింది. ఇక గ‌త వారంతో పోలిస్తే ఇది 8 శాతం ప‌త‌న‌మై రూ. 2,200 త‌గ్గింది. వెండి కూడే అంతే శాతం త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త వారం కేజీ వెండి రేటు రూ. 51,489 ఉండ‌గా ఇప్పుడు అది 8 శాతం త‌గ్గింది.

ప్ర‌పంచ‌ మార్కెట్‌లో బంగారం ధర స్తబ్దుగానే కొనసాగుతోంది. ఒక ఔన్సు బంగారం రేటు 1499 డాల‌ర్ల వ‌ద్ద కాస్త అటూ ఇటూగా మూవ్ అవుతోంది. ఇక ప్ర‌పంచ మార్కెట్లో బంగారం ధర గ‌రిష్టంగా 1,550 డాలర్ల స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు 4 శాతం త‌గ్గింది. ఇక వెండి రేటు కూడా ఔన్సు 18 డాల‌ర్లకు కాస్త అటూ ఇటూగా ఉంది.

ఏదేమైనా బంగారం రేటు త‌గ్గ‌డంతో ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ బంగారం బిజినెస్ జోరుగా జ‌రుగుతోంది. వ‌చ్చే రెండు మూడు నెల‌ల్లో బంగారం అమ్మ‌కాలు మ‌రింత జోరందుకుంటాయ‌ని.. ఫ్యూచ‌ర్‌లో ఈ రేటు మ‌రింత ఎక్కువుగా ఉంటుంద‌ని జులియ‌న్ ట్రేడ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version