కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెన్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే.. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది.
ఐదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు ఫైర్ సిబ్బంది. అయితే.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. ఈ అగ్ని ప్రమాదానికి పూర్తిగా కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమ బూడిదైందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.