Telangana: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..నేటి నుంచి 24 రోజుల పాటు ఒంటి పూట బడులు !

-

Telangana: నేటి నుంచే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. అయితే…సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయడానికి తెలంగాణ ఉపాధ్యాయులను వినియోగించుకుంటోంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. నవంబర్ 30 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల మంది ఎన్యుమరేటర్లు ఈ కులగణన సర్వేలో పాల్గొనబోతున్నారు.

One-day classes from November 6

ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొనబోతున్నారు. ఈ తరునంలోనే… తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 30 వరకు ఒంటి పూడ బడులు కొనసాగనున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వే లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే ఈ ఒంటిపూట బడులు కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news