Breaking : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

-

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీగా భారతీకొలికెరి, హనుమకొండ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, నిజామాబాద్‌ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, వికారాబాద్‌ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా షేక్‌ యాషిన్‌ బాష, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా జి.రవిని ప్రభుత్వం నియమించింది. సూర్యాపేట కలెక్టర్‌గా వెంకట్రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా హరీశ్‌, మంచిర్యాల కలెక్టర్‌గా బి. సంతోష్‌, మెదక్‌ కలెక్టర్‌గా రాజశ్రీ షా, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా తేజస్‌ పవార్‌, నిర్మల్‌ కలెక్టర్‌గా వరుణ్‌రెడ్డి, జగిత్యాల ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా కర్ణన్‌, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా బి. సంతోష్‌ను నియమిస్తున్నట్లు తెలంగాణ సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇటీవల.. భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. బదిలీలో కరీంనగర్, రామగుండం సీపీలతో పాటు నల్లగొండ, సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి ఎస్పీలు ఉన్నారు. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్ గిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version