కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ కూడా వినే పరిస్థితి కనపడటం లేదు. దేశ వ్యాప్తంగా ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తామని కేంద్రం చెప్పింది. తాజాగా తమిళనాడు లో జరిగిన ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. మదురై సమీపంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
దేవస్థానానికి చెందిన ఒక ఎద్దు ముదువరపట్టి గ్రామంలో మరణించింది. ఆ ఎద్దు జల్లి కట్టులో పాల్గొంది. దీనితో దానిని దేవుడి ఎద్దుగా భావించారు. దాని అంత్యక్రియలను ఘనంగా నిర్వహించాలి అని భావించారు. దీనితో గ్రమంలో ఉన్న వందల మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. మదురై సమీప ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు.
అయినా సరే ప్రజలు మాత్రం మాట వినలేదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి దాని అంత్యక్రియల్లో పాల్గొన్నా పోలీసులు మాత్రం చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు తెలియడం తో పాల్గొన్న గ్రామస్తులు అందరిపై కేసులు నమోదు చేసారు. వారి అందరిపై హత్య కేసులను నమోదు చేసారు. సామాజిక దూరం పాటించాలి అని చెప్పినా సరే ఎవరూ కూడా వినలేదు. దీనితో గ్రామంలో భారీగా పోలీసులు మొహరించారు.