భార్య అడిగిందని.. 23 ఏళ్ల పాటు శ్ర‌మించి అంద‌మైన భూగ‌ర్భ కోట‌ నిర్మించాడ‌త‌ను..!

-

శ‌రీరాలు వేరైనా.. మ‌న‌స్సు మాత్రం ఒక్క‌టే.. అలాగే భార్యాభ‌ర్త జీవించాలి. అప్పుడే అది చ‌క్క‌ని దాంప‌త్యం అనిపించుకుంటుంది. ఒక‌రి అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాల‌కు మ‌రొక‌రు గౌర‌వం ఇవ్వాలి. భార్య‌భ‌ర్త ఇద్ద‌రూ అన్యోన్యంగా ఉండాలి. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని న‌మ్మాడు కాబ‌ట్టే అత‌ను త‌న భార్య కోసం ఎవ‌రూ చేయ‌ని విధంగా ఒక అద్భుత‌మైన ప‌నిచేశాడు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి త‌న భార్య‌కు ఒక ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని ఇచ్చాడు. అదేమిటంటే…

ఆర్మేనియా దేశం అది. అక్క‌డి అరింజ్ అనే గ్రామానికి చెందిన లెవోన్ అర‌కెల్యాన్ అనే వ్య‌క్తి ఆర్కిటెక్ట్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే అత‌ని భార్య టోస్యా త‌న భ‌ర్త‌ను చిన్న కోరిక కోరింది. అదేమిటంటే.. వస్తువులు, ఆహార పదార్థాలు దాచుకోవడానికి ఓ చిన్న బేస్‌మెంట్‌ను నిర్మించమని చెప్పింది. అయితే భార్య కోరిక చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ అత‌ను దాన్ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ది భార్య‌కు అందించాల‌నుకున్నాడు. అందులో భాగంగానే రోజుకు 18 గంటలు శ్రమిస్తూ…23 ఏళ్ల పాటు భూగర్భంలో తవ్వుకుంటూ వెళ్లాడు. అయితే ఆ ప‌ని ఆపేయ‌మ‌ని టోస్యా చెప్పింది. కానీ లెవోన్ విన‌లేదు. చివ‌ర‌కు త‌న ప‌ని పూర్తి చేశాడు.

అలా లెవోన్ 23 ఏళ్ల పాటు శ్రమించి, ఒంటి చేత్తో 600 టన్నుల మ‌ట్టి, రాళ్ల‌ను త‌వ్వి భార్య కోసం అంద‌మైన భూగ‌ర్భ కోట‌ను నిర్మించాడు. దీంతో లెవోన్ భార్య టోస్యా త‌న భ‌ర్త బ‌హుమ‌తికి మురిసిపోతోంది. అయితే ఇప్పుడా బేస్ మెంట్‌ను వారు ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చారు. దీంతో దాన్ని ప‌ర్యాట‌కులు కూడా వీక్షిస్తూ మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు. ఏది ఏమైనా భార్య కోసం ఇంత‌టి ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని అందించిన లెవోన్‌ను అభినందించాల్సిందే క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news