గెలిచిన హీరో సూర్య .. ఓటిటిలో విడుదల..? ఇదెవరూ ఊహించనిది ..!

-

కరోనా తెచ్చిన మార్పులు పరిశ్రమలలో భారీగా చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయి నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా ఫైనాన్స్ తెచ్చి మరీ నిర్మించిన నిర్మాతలకి అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలని థియోటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశం లేక నేరుగా ఓ.టీ.టీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేయాలని కొద్ది రోజులుగా అనుకుంటున్న సంగతి తెలిసిందే.

 

అయితే ఈ ఆలోచన ముందుగా తమిళ హీరో చేసి తన భార్య నటించిన సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలనుకున్నాడు. అందుకు అగ్రిమెంట్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక రిలీజే తరువాయి అనుకున్న సమయంలో థియోటస్ యాజమాన్యం, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ దానిని ఖండించారు. ఇలా అయితే ఇక నుంచి సూర్య నిర్మించిన సినిమాలు గాని, సూర్య, కార్తీ ల సినిమాలని థియోటర్స్ లో రిలీజ్ చేయనివ్వమంటు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇది గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద వివాదంగా మారింది. అయితే ఎట్టకేలకు హీరో సూర్య తన పంతం నెగ్గించుకున్నాడు. కొద్దిరోజులుగా సూర్య కి తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం నడుస్తుంది.

కేరళ థియేటర్స్ సంఘాలు కూడా వారికి మద్దతు పలకడంతో సూర్య పోన్మగళ్ వందాల్ సినిమాని ఓ టి టి లో విడుదల చేయడాన్ని నిలిపివేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఐతే సూర్య ఆ బెదిరింపులకు భయపడకుండా తను అనుకున్నదే చేశాడు. నిజంగా ఇది ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రం మే 29నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న ఫస్ట్ తమిళ్ మూవీ ఇదే కావడం విశేషం. అయితే తర్వాత సూర్య సినిమాలను రిలీజ్ చేస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news