ప్రేమించి పెళ్లాడాడు…కానీ 7నెల‌లు అవ్వ‌గానే…!

తపస్విని దాస్, వైద్యుడు సునీత్‌ సాహు కోర్టు సమక్షంలో రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. అత‌డో వైద్యుడు…. ప్రేమించిన యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతో విద్యావంతుడైన‌ప్ప‌టికీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌ను న‌మ్మించి మోసం చేశాడు. ఈ ఘ‌ట‌న ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే….త‌ప‌స్విని దాస్ అనే యువ‌తి సునీత్ సాహు అనే యువ‌కుడు కొంత‌కాలం పాటూ ప్రేమించుకున్నారు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి జీవించాల‌ని నిర్ణియించుకున్నారు. దాంతో కోర్టు ఎదుట రిజిస్ట‌ర్ మ్యారెజ్ చేసుకున్నారు.

ఏడు నెల‌ల పాటు వీరి కాపురం స‌క్ర‌మంగానే సాగింది. కానీ ఆ త‌ర‌వాత సునీత్ ఇంట్లో నుండి పరార్ అయ్యాడు. మోజు తీర‌డంతో ప్రేమించి పెళ్లాడిన యువ‌తిని వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దాంతో త‌ప‌స్విని యువ‌కుడి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. త‌న భ‌ర్త త‌న‌కు కావాలంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆమెకు స్థానిక సంఘ్ నాయ‌కురాలు ప్ర‌మీల మ‌ద్ద‌తు తెలిపారు. యువ‌తిని మోసం సునీత్ ను శిక్షించాల‌ని అమె డిమాండ్ చేస్తున్నారు.