ప్రజాస్వామ్య సదస్సుకు భారత్ కు అమెరికా ఆహ్వానం.. చైనా, రష్యాలకు మొండిచేయి.

డిసెంబర్ నెల 9-10 తేదీల్లో అమెరికా అధ్యక్షతన ప్రజాస్వామ్య సదస్సు జరుగబోతోంది. వర్చువల్ జరిగే ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ శాఖ మొత్తం 110 దేశాలకు ఆహ్వనం పంపింది. దీంట్లో భాగంగానే సదస్సుకు భారత్ ను కూడా ఆహ్వనించింది. అయితే ప్రపంచంలో అగ్ర దేశాలుగా ఉన్న చైనా, రష్యాలకు మాత్రం అమెరికా ఆహ్వనం పంపలేదు. నాటోల సభ్య దేశంగా ఉన్న టర్కీని కూడా అమెరికా పట్టించుకోలేదు. దక్షిణాసియా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకా దేశాలను కూడా అమెరికా ఆహ్వానించలేదు. అమెరికా ప్రజాస్వామ్య సదస్సుకు ఆహ్వనించిన దేశాల్లో దేశాల్లో భారత్, పాకిస్థాన్ తోపాటు ఇరాక్ కూడా ఉంది. ఆసియా నుంచి జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలను అమెరికా ఆహ్వానించింది. వియత్నాం, థాయ్ లాండ్ దేశాలకు ఆహ్వానం లేదు.

అయితే ఈ సమావేశానికి చైనాతో ఆహ్వానించకపోవడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జో బిడెన్ యంత్రాంగం తైవాన్ దేశాన్ని ఈ సదస్సుకు ఆహ్వానించడం ప్రస్తుతం చర్చకు తావిచ్చింది. చైనా ఎప్పటి నుంచో తైవాన్ వన్ చైనా విధానంలో అంతర్భాగం అని చెబుతోంది. ఇటీవల తైవాన్, చైనాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. ప్రస్తుతం అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాకు పుండుమీద కారం చల్లిన విధంగా ఉంది. ఇటీవల చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ల మధ్య జరిగిన వర్చువల్ భేటీలో కూడా తైవాన్ పై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. చైనా నిరంకుశంగా వ్యవహరిస్తుండంతోనే ప్రస్తుతం అమెరికా ఆదేశాన్ని ఆహ్వనించడం లేదని తెలుస్తోంది.