తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఏకంగా తల బీరుసీసాను పగులగొట్టుకుని నడిరోడ్డపై నానా హంగామా చేశాడు. ఈ ఘటన జగిత్యాల పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానికంగా ఉంటున్న శివరామ్ అనే యువకుడికి వివాహం జరిగింది. అయితే, తన భార్య కొంతకాలంగా కాపురానికి రావడం లేదని తెలిసింది.దీంతో గత కొన్ని రోజులుగా అతడు మద్యం సేవిస్తూ తిరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మద్యం మత్తులో బీరు సీసాతో తలకు గాయం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని శివరామ్ స్టేషన్ ఎదుట హల్చల్ చేశాడు.
భార్య కాపురానికి రావట్లేదని బీరు సీసాతో తలపై కొట్టుకున్న యువకుడు
జగిత్యాల పోలీస్ స్టేషన్ ఎదుట శివరామ్ అనే యువకుడు హల్చల్ చేశాడు. గత కొన్ని రోజుల నుంచి తన భార్య కాపురానికి రావడం లేదని మద్యం మత్తులో బీరు సీసాతో తలకు గాయం చేసుకున్న శివరామ్. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వస్తే… pic.twitter.com/IP7wNveaew
— ChotaNews App (@ChotaNewsApp) March 13, 2025