పతీసహగమనం.. భార్య చితిలోకి దూకిన భర్త !

-

ఒడిశా లోని దారుణం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టు కోలేని ఓ భర్త ఆమె చితి లోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా గోలముండా సమితి లోని శైలు జోడి గ్రామం లో జరిగింది. ఈ ఘటన వివరాల్లో కి వెళితే… శైలు జోడి గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) ఇద్దరు భార్యా భర్తలు. వీరికి నలుగురు కుమారులు కూడా ఉన్నారు.

రాయబారి మంగళ వారం రోజున గుండె పోటు తో మరణించింది. దీంతో అంత్య క్రియల కోసం మృతి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృత దేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలు దేరారు. అందరితో పాటే ఇంటికి బయలు దేరిన నీలమణి ఆ తర్వాత… ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తు కొచ్చి భార్య చితి మంటలలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే.. అతడు భార్య తో సహా దహనమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version