ఫోన్ మాట్లాడుతుందని భార్యను హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త

-

ఫోన్ మాట్లాడుతుందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టాడు భర్త. రాంగ్ నెంబర్ ద్వారా పరిచయం అయి.. ప్రేమించి పెళ్లి చేసుకుంది జంట. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకి రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైంది మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్‌కు చెందిన శ్రావణి (27). ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకుంది ఈ జంట.. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

Husband kills wife, pours petrol on her, and sets her on fire, alleging she was talking on the phone
Husband kills wife, pours petrol on her, and sets her on fire, alleging she was talking on the phone

పెళ్లయిన కొంతకాలానికే భర్త, పిల్లలను వదిలేసి తన అక్క భర్తతో వెళ్లిపోయింది శ్రావణి.. ఏడాది క్రితం మళ్ళీ తిరిగి రాగా ఆమెను భార్యగా అంగీకరించారు శ్రీశైలం. శ్రావణి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించి తరచూ గొడవపడ్డాడు శ్రీశైలం. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని పథకం వేసాడు భర్త. సోమశిలకు వెళదామని భార్యను బైక్‌పై తీసుకెళ్లి.. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో సీతాఫలం పండ్లు ఉంటాయని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసాడు భర్త. పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు శ్రీశైలం. తన కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా.. అంతలోనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు భర్త శ్రీశైలం.

Read more RELATED
Recommended to you

Latest news