హుజూరాబాద్ బై ఎలక్షన్ లో బీజేపీ సత్తా చాటుతోంది. వరసగా లీడ్ ను పెంచుకుంటూ వెళ్లుతుంది. అంతే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బిగ్ ఫైట్ ను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ మాత్రం ఊసులో లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం ఏర్పడింది. ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సి ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీన్ని ’ఈటెల రాజేందర్ గెలుపు‘ గా అభివర్ణించారు. కౌషిక్ రెడ్డిపై ఉత్తమ్ ప్రేమ కాంగ్రెస్ పార్టీ కొంపముంచిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ తీరుతో రేవంత్ రెడ్డి వచ్చిన మార్పులేదన్నారు. ఓటమిపై కాంగ్రెస్ నాయకత్వం సమీక్షించుకోవాలని పొన్నం అన్నారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పనిచేసినట్లు హుజూరాబాద్ లో కాంగ్రెస్ పనిచేయలేదని ఆయన అన్నారు. హుజూరాబాద్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఒక్క సభ పెట్టలేకపోయారని కాంగ్రెస్ తీరును విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ద్రుష్టికి తీసుకెళ్తా.. అని అన్నారు.