హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

-

దేశవ్యాప్తంగా అందరిని ద్రుష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ బై పోల్ సమరానికి రంగం సిద్ధం అయింది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యం, డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు తమకు డబ్బులు ఇవ్వడం లేదని పలువురు గొడవకు దిగిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఈ తతంగంపై సీఈసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రలోభాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగనుండటంతో అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో 1715 పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. 2,37,036 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ ను విధించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంలో 77 సమస్యత్మక, 15 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో పోలీసులు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మాస్కు ఉంటేనే పోలింగ్ కేంద్రానికి అనుమతించనున్నారు. పోలింగ్ ఏజెంట్లు, సిబ్బంది తప్పిని సరిగా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంటేనే అనుమతించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version