నరాలు తెగే ఉత్కంఠత నడుమ హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎప్, బీజేపీ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా ఫస్ట్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. తొలి రౌండ్ లో హుజూరాబాద్ మండలంలోని పోల్ అయిన ఓట్లను లెక్కించారు. బీజేపీ తరుపున ఈటెల రాజేందర్ 166 ఓట్ల లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ లో మొత్తం 9804 ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్ లో బీజేపీకి 4610 ఓట్లు రాగా.. 4444 ఓట్లు టీఆర్ఎస్ కు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 119 ఓట్లు లభించాయి. తొలి రౌండ్ లో హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, శాలపల్లి, సిర్సపల్లి, చెల్పూర్, ఇందిరా నగర్ మొదలైన గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు లీడ్ లభించింది. మొత్తం 753 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకీ 503, బీజేపీకి 159 ఓట్లు పోలయ్యాయి.