ఏపీలో మిగిలిపోయిన పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. గత మార్చిలోనే స్థానిక పోరు జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కొన్ని స్థానాలకు ఎన్నిక వాయిదా పడింది…అలాగే కొన్ని చోట్ల అభ్యర్ధులు చనిపోయారు…దీంతో ఆ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా 69 పంచాయితీలకు, 533 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు…అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇక 15వ తేదీన నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 6 కార్పోరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో, 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు జరపనున్నారు. 17న కౌంటింగ్. ఇక 16వ తేదీన 187 ఎంపిటిసిలకు, 16 జెడ్‌పిటిసిలకు ఎన్నిక జరగనుంది. 18న కౌంటింగ్.
అయితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ క్లీన్‌స్వీప్ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఏదో ఒక తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి అన్నీ వైసీపీనే గెలుచుకునేలా ఉంది. నెల్లూరుతో కార్పొరేషన్‌తో పాటు, ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం,రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో వైసీపీ హవా కొనసాగేలా ఉంది.
ఇక ఇందులో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎందుకంటే అది చంద్రబాబు…సొంత నియోజకవర్గం కాబట్టి. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలోని పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా విజయాలు సాధించింది. ఇక కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుని చంద్రబాబుకు చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది.